General News

కరోనా రోజుల్లో అమ్మాయిలతో తహశీల్దార్ డ్యాన్స్.. చివరికి ఏం జరిగిందంటే?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసం అధికారులు ఎంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు.మాస్కులు లేకుండా బయట కనబడితే పోలీసులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైనా శుభకార్యాలకు కూడా పరిమిత జనంతో వివాహాలకు అనుమతి తెలుపుతున్నారు. ఈ విధంగా కరోనా కట్టడి కోసం అధికారులు శ్రమిస్తున్న తరుణంలో ఒక బాధ్యతగల అధికారి తనకు కరోనా నిబంధనలు పట్టనట్టుగా వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒడిశా… జైపూర్ జిల్లాలోని సుకిందాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. బయట జరిగే వేడుకల్లో 25 మందికి మించి అనుమతి లేదు. కానీ తహశీల్దారు బుల్‌బుల్ బెహెరా తన సోదరుడి వివాహ వేడుకలలో పాల్గొన్నారు.ఈ పెళ్లి వేడుకకు పెద్ద మొత్తంలో బంధువులు రాగా, ఆ పెళ్లిలో ఎవరు మాస్క్ లు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా నాగిని డాన్స్ లు చేస్తూ సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఎమ్మార్వో సైతం అమ్మాయితో కలిసి డాన్సులు చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాస్కులు లేకుండా బయట కనపడితే సామాన్య ప్రజలకు జరిమానా విధిస్తారు మరి ఈ బాధ్యత గల అధికారి పట్ల ప్రభుత్వం ఏ ఈ విధమైన చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒక బాధ్యత గల అధికారి అయ్యుండి కూడా సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడంతో తహసిల్దార్ బెహెరా పై చర్యలు తీసుకోవడానికి ఒడిశా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించినది ఎవరైతే ఏంటి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఒడిషా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మార్వో పై విపత్తు నిర్వహణ కింద కేసు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago