దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు. అదేవిధంగా కరోనా కట్టడి కోసం అధికారులు ఎంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు.మాస్కులు లేకుండా బయట కనబడితే పోలీసులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైనా శుభకార్యాలకు కూడా పరిమిత జనంతో వివాహాలకు అనుమతి తెలుపుతున్నారు. ఈ విధంగా కరోనా కట్టడి కోసం అధికారులు శ్రమిస్తున్న తరుణంలో ఒక బాధ్యతగల అధికారి తనకు కరోనా నిబంధనలు పట్టనట్టుగా వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒడిశా… జైపూర్ జిల్లాలోని సుకిందాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. బయట జరిగే వేడుకల్లో 25 మందికి మించి అనుమతి లేదు. కానీ తహశీల్దారు బుల్‌బుల్ బెహెరా తన సోదరుడి వివాహ వేడుకలలో పాల్గొన్నారు.ఈ పెళ్లి వేడుకకు పెద్ద మొత్తంలో బంధువులు రాగా, ఆ పెళ్లిలో ఎవరు మాస్క్ లు పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా నాగిని డాన్స్ లు చేస్తూ సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఎమ్మార్వో సైతం అమ్మాయితో కలిసి డాన్సులు చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాస్కులు లేకుండా బయట కనపడితే సామాన్య ప్రజలకు జరిమానా విధిస్తారు మరి ఈ బాధ్యత గల అధికారి పట్ల ప్రభుత్వం ఏ ఈ విధమైన చర్యలు తీసుకుంటుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఒక బాధ్యత గల అధికారి అయ్యుండి కూడా సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడంతో తహసిల్దార్ బెహెరా పై చర్యలు తీసుకోవడానికి ఒడిశా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించినది ఎవరైతే ఏంటి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఒడిషా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మార్వో పై విపత్తు నిర్వహణ కింద కేసు నమోదు చేశారు.































