Pallavi prashanth Father: బిగ్ బాస్ కార్యక్రమంలో రైతుబిడ్డ గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఒక రైతు బిడ్డ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ట్రోఫీ అందుకున్నారని సంతోషపడేలోపు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహం కనబరుస్తూ ఇతర సెలబ్రిటీల కార్లపై రాళ్ల దాడి చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులను రెచ్చగొట్టారు అంటూ పోలీసులు తనని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా గెలిచిన కొన్ని గంటలలోనే ఈయన తిరిగి జైలుకు వెళ్లడంతో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక రైతు బిడ్డగా నా కొడుకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి గెలిచారని చాలా సంతోషపడ్డాం. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు ఉండనివ్వలేదని నా కొడుకు పై తప్పుడు కేసులు, రాతలు రాస్తూ తనని జైలుకు పంపించారని ఎమోషనల్ అయ్యారు.
నా కొడుకు ఒక రైతుబిడ్డ కావడంతోనే ఇలా కక్ష కట్టారని అదే ఒక సెలబ్రిటీ అయితే వారిని అరెస్టు చేసే వాళ్ళ అంటూ కూడా ఈయన ప్రశ్నించారు. ఇందులో నా కొడుకు తప్పు ఏమీ లేదని అప్పుడు నేను నా కొడుకు పక్కనే ఉన్నానని కూడా సత్యనారాయణ తెలిపారు. ఒక రైతు బిడ్డగా నా కొడుకు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటేనే బాగుండేది ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.
తప్పుడు రాతలు రాశారు..
మాది ఒక మారుమూల గ్రామం రాత్రి వచ్చి నా కొడుకును తీసుకువెళ్లారు మాకు బెయిల్ తీసుకోవడం లాంటివి కూడా తెలియదు నా ఇద్దరు కొడుకులను పోలీసులు తీసుకెళ్లడంతో నా భార్య అనారోగ్యానికి గురైందని కొడుకులపై బెంగ పెట్టుకొని ఏడుస్తూనే ఉంది అంటూ ఈ సందర్భంగా సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…