వేసవికాలం వచ్చేసింది.. సమ్మర్లో పిల్లలు ఎక్కువగా అనారోగ్యంతో భాధపడుతుంటారు. దానికి అసలైన కారణం పిల్లలకు ఆహరం పట్ల సరియైన అవగాహన లేకపోవడం…
1.వేసవి కాలంలో చాలా మంది పిల్లలు తినడానికి మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చేసుకోవచ్చు.. 2) పిల్లల ఆహారం విషయంలో తల్లి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. బిడ్డను ప్రతి తల్లి ఎంతో ఆప్యాయతతో అన్ని తానే అయి పెంచుతుంది. అటువంటి బిడ్డకు సరైన ఆహారం ఇవ్వడం ప్రతి తల్లి యొక్క బాధ్యత. ప్రతి తల్లి తన బిడ్డ విషయంలో అన్ని కాలంలో కన్నా వేసవికాలంలో ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. 3 ) ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలకు ఈ కాలంలో వేడి చేసి మూత్ర విసర్జన మరియు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. చంటి పిల్లలు ఒక్కోసారి ఎందుకు ఏడుస్తారో ఎవరు తెలుసు కోలేకపోతారు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే…..
పిల్లలకు ఎక్కువ మందులు వాడకుండా ఇటువంటి వంటింటి చిట్కాలు వాడడం వలన పిల్లల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 6 నెలల లోపు తల్లి పాలు తాగే పిల్లలకు ఒక ఉగ్గు గిన్నెడు తల్లి పాలు తీసుకొని దానిలో నాలుగు జీలకర్ర పలుకులు వేసి ఒక గంటసేపు నానపెట్టి వాటిని వడపోసి బిడ్డకు పడితే ఎంతో చలవ చేస్తుంది. దీని వల్ల మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది. మరియు మలవిసర్జన కూడా సాఫీగా ఉంటుంది. ఈ కాలంలో ఇలా ప్రతి రోజు బిడ్డకు పట్టవచ్చు. దీని వలన ఎటువంటి దుస్ఫలితాలు ఉండవు.. అదే 6 నెలల నుండి 1 సంవత్సరం దాటిన పిల్లలకు అయితే ద్రవ పదార్థాల రూపంలో తాగించవచ్చు..
అందులో ముఖ్యంగా…… మన అందరికి తెలిసిన ఎండు ద్రాక్ష వీటినే కిస్ మిస్ పండ్లు కూడా అంటారు. ఒక చిన్న గ్లాస్ నీళ్లలో 5 ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే అవి పిల్లలకు పడితే శరీరం లోని ఉష్ణాన్ని తగ్గించడమే కాకుండా పిల్లలకు తక్షణ శక్తి అందుతుంది. కాబట్టి ప్రతి తల్లి ఈ కాలంలో తమ యొక్క బిడ్డలకు ఈ పద్దతిలో నీటిని పడితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మరియు వేసవిలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
2 సంవత్సరాలు దాటిన పిల్లలు అయితే తినడానికి బాగా ఇబ్బంది పెడతారు. అప్పటివరకు మనం పెట్టింది తింటూ ఉండే వారికీ పెరుగుతున్న క్రమంలో వాళ్ళ నోటికి అన్ని రకాల రుచులు తెలుస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పదలిచింది ఏమిటంటే ఈ వయసు పిల్లలు ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్ వంటివి తినడానికి ఇష్టపడతారు. చల్లని పదార్థాలు తినడానికి, తిన్న తర్వాత చల్లగా ఉంటాయి కానీ అవి తర్వాత బిడ్డ ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి సాధ్యమైనంత దూరంగా పిల్లలను ఉంచడం మంచింది.
2 సంవత్సరాలు వయస్సు దాటిన పిల్లలకు ఒక గ్లాస్ నీటిలో 4 ఎండు ద్రాక్ష, ఒక ఎండు ఖార్జురం వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే వాటిని మిక్స్ పట్టి వడపోసి పిల్లలకు తగిస్తే చాలా మంచిది. ఈ నీటిని పిల్లలకు పట్టడం వలన వల్ల శరీరానికి ఐరన్, విటమిన్స్ కూడా అందుతాయి. పిల్లలు ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు. మరియు వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ఎండాకాలంలో వేడిమి వలన శరీరంలో నీకు అంతా చెమట రూపంలో బయటకు పోతుంది. కాబట్టి పిల్లలు త్వరగా అలిసిపోతారు. మరియ తమ శక్తిని కోల్పోతారు అందువలన పిల్లలకు తప్పనిసరిగా ఈ నీటిని ఇవ్వడం వలన తిరిగి శక్తిని నింపిన వారు అవుతారు మరియు యూరినరీ సమస్యలు కూడా తొలగిపోతాయి.
ఏ వయస్సు వారైనా ఎక్కువ మంచినీళ్లు తీసుకోవడం వలన శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవచ్చు. అవి ఒక మంచినీళ్లు రూపంలోనే కాకుండా మజ్జిగ, జ్యూస్, ముఖ్యంగా రాగి జావ, బార్లీ జావ వంటివి తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని 2 సంవత్సరాలు దాటినా పిల్లలకు కూడా పట్టవచ్చు. వీటి వల్ల వాళ్ళ శరీరంలో నీటి శాతం పెరిగి వారి యొక్క జీవ క్రియ సక్రమంగా సాగడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా మనం ఈ రాగి జావా,బార్లీ జావా గురించి చెప్పుకుంటే వీటిని తాగడం వలన ప్రతి ఒక్కరికి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. చాలామంది వీటిని ఆరోగ్యం బాలేనపుడు లేదా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ కాలములో ప్రతి రోజు వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.
ఈ చిట్కాలను పాటించి మీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…