Connect with us

Featured

వేసవికాలం వచ్చేసింది..మరి పిల్లల ఆహారంపై తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!!

Published

on

వేసవికాలం వచ్చేసింది.. సమ్మర్లో పిల్లలు ఎక్కువగా అనారోగ్యంతో భాధపడుతుంటారు. దానికి అసలైన కారణం పిల్లలకు ఆహరం పట్ల సరియైన అవగాహన లేకపోవడం…

1.వేసవి కాలంలో చాలా మంది పిల్లలు తినడానికి మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చేసుకోవచ్చు.. 2) పిల్లల ఆహారం విషయంలో తల్లి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. బిడ్డను ప్రతి తల్లి ఎంతో ఆప్యాయతతో అన్ని తానే అయి పెంచుతుంది. అటువంటి బిడ్డకు సరైన ఆహారం ఇవ్వడం ప్రతి తల్లి యొక్క బాధ్యత. ప్రతి తల్లి తన బిడ్డ విషయంలో అన్ని కాలంలో కన్నా వేసవికాలంలో ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. 3 ) ముఖ్యంగా సంవత్సరం లోపు పిల్లలకు ఈ కాలంలో వేడి చేసి మూత్ర విసర్జన మరియు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. చంటి పిల్లలు ఒక్కోసారి ఎందుకు ఏడుస్తారో ఎవరు తెలుసు కోలేకపోతారు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే…..

Advertisement

పిల్లలకు ఎక్కువ మందులు వాడకుండా ఇటువంటి వంటింటి చిట్కాలు వాడడం వలన పిల్లల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 6 నెలల లోపు తల్లి పాలు తాగే పిల్లలకు ఒక ఉగ్గు గిన్నెడు తల్లి పాలు తీసుకొని దానిలో నాలుగు జీలకర్ర పలుకులు వేసి ఒక గంటసేపు నానపెట్టి వాటిని వడపోసి బిడ్డకు పడితే ఎంతో చలవ చేస్తుంది. దీని వల్ల మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది. మరియు మలవిసర్జన కూడా సాఫీగా ఉంటుంది. ఈ కాలంలో ఇలా ప్రతి రోజు బిడ్డకు పట్టవచ్చు. దీని వలన ఎటువంటి దుస్ఫలితాలు ఉండవు.. అదే 6 నెలల నుండి 1 సంవత్సరం దాటిన పిల్లలకు అయితే ద్రవ పదార్థాల రూపంలో తాగించవచ్చు..

అందులో ముఖ్యంగా……‌ మన అందరికి తెలిసిన ఎండు ద్రాక్ష వీటినే కిస్ మిస్ పండ్లు కూడా అంటారు. ఒక చిన్న గ్లాస్ నీళ్లలో 5 ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే అవి పిల్లలకు పడితే శరీరం లోని ఉష్ణాన్ని తగ్గించడమే కాకుండా పిల్లలకు తక్షణ శక్తి అందుతుంది. కాబట్టి ప్రతి తల్లి ఈ కాలంలో తమ యొక్క బిడ్డలకు ఈ పద్దతిలో నీటిని పడితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మరియు వేసవిలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.

2 సంవత్సరాలు దాటిన పిల్లలు అయితే తినడానికి బాగా ఇబ్బంది పెడతారు. అప్పటివరకు మనం పెట్టింది తింటూ ఉండే వారికీ పెరుగుతున్న క్రమంలో వాళ్ళ నోటికి అన్ని రకాల రుచులు తెలుస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పదలిచింది ఏమిటంటే ఈ వయసు పిల్లలు ఈ వేసవి కాలంలో ఎక్కువగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్ వంటివి తినడానికి ఇష్టపడతారు. చల్లని పదార్థాలు తినడానికి, తిన్న తర్వాత చల్లగా ఉంటాయి కానీ అవి తర్వాత బిడ్డ ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి సాధ్యమైనంత దూరంగా పిల్లలను ఉంచడం మంచింది.

2 సంవత్సరాలు వయస్సు దాటిన పిల్లలకు ఒక గ్లాస్ నీటిలో 4 ఎండు ద్రాక్ష, ఒక ఎండు ఖార్జురం వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే వాటిని మిక్స్ పట్టి వడపోసి పిల్లలకు తగిస్తే చాలా మంచిది. ఈ నీటిని పిల్లలకు పట్టడం వలన వల్ల శరీరానికి ఐరన్, విటమిన్స్ కూడా అందుతాయి. పిల్లలు ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు. మరియు వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

ఎండాకాలంలో వేడిమి వలన శరీరంలో నీకు అంతా చెమట రూపంలో బయటకు పోతుంది. కాబట్టి పిల్లలు త్వరగా అలిసిపోతారు. మరియ తమ శక్తిని కోల్పోతారు అందువలన పిల్లలకు తప్పనిసరిగా ఈ నీటిని ఇవ్వడం వలన తిరిగి శక్తిని నింపిన వారు అవుతారు మరియు యూరినరీ సమస్యలు కూడా తొలగిపోతాయి.

Advertisement

ఏ వయస్సు వారైనా ఎక్కువ మంచినీళ్లు తీసుకోవడం వలన శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవచ్చు. అవి ఒక మంచినీళ్లు రూపంలోనే కాకుండా మజ్జిగ, జ్యూస్, ముఖ్యంగా రాగి జావ, బార్లీ జావ వంటివి తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని 2 సంవత్సరాలు దాటినా పిల్లలకు కూడా పట్టవచ్చు. వీటి వల్ల వాళ్ళ శరీరంలో నీటి శాతం పెరిగి వారి యొక్క జీవ క్రియ సక్రమంగా సాగడానికి ఎంతో దోహదపడుతుంది.‌ ముఖ్యంగా మనం ఈ రాగి జావా,బార్లీ జావా గురించి చెప్పుకుంటే వీటిని తాగడం వలన ప్రతి ఒక్కరికి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. చాలామంది వీటిని ఆరోగ్యం బాలేనపుడు లేదా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ కాలములో ప్రతి రోజు వీటిని తీసుకోవడం ఎంతో మంచిది.

ఈ చిట్కాలను పాటించి మీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!