Pavala Shyamala : బాబాయ్ అబ్బాయి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, తెలుగులో చాలా సినిమాల్లో నటించిన పావలా శ్యామల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ‘ఛాలెంజ్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె ఆ తరువాత ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. అలా చాలా సినిమాల్లో చేసిన పావలా శ్యామల ప్రస్తుతం వృధాప్యంలో అనారోగ్య సమస్యల వల్ల ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక ఈమె పరిస్థితి చూసి చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు సహాయం చేసారు అంటూ వార్తలు వినిపించాయి. వీటన్నింటికి క్లారిటీ ఇవ్వడానికే పావలా శ్యామల యూట్యూబ్ ఛానెల్ ను పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు.

మంచు విష్ణు కి బాధ్యత లేదా…
మా అసోసియేషన్ నుండి ఇదివరకు మెసేజ్ వచ్చేది ఇక ఇప్పుడు అది కూడా రావడం లేదు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ ను కూడా కాదు, అయినా నన్ను ఎలా ఉన్నావ్ చచ్చావా బతికావా అని కూడా పలకరించలేదు. ‘ఆంధ్రవాలా’ వంటి సినిమాలో ఎన్టీఆర్ తో నటించాను. పెద్ద హీరోలు కోట్లు సంపాదిస్తున్నారు. వారికి నాలాంటివాళ్ళకి చేసే సహాయం పెద్దది కాదు కానీ చేయరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ వంటి వారు సహాయం చేయాలన్నా వారిని ఎలా కలవాలి, చెప్పేవారెవరు అంటూ వాపోయారు.

ఇక మా అసోసియేషన్ కి కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ విష్ణు కి బాధ్యత లేదా అంటూ మాట్లాడారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కనీసం సహాయం మాట పక్కన పెడితే ఉందా పోయిందా అని కూడా తెలుసుకోరా. మోహన్ బాబు గారికి నేను తెలుసు పరిచయం ఉంది కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నా కూతురుకి కాళ్ళు లేవు, అనారోగ్యం తో బాధపడుతోంది అన్న సమయంలో శివ నాగేశ్వరావు గారు అలాగే ఆయన మిత్రుడు పేరు చెప్పకుండానే సహాయం చేసారు. ఇక మిగిలినవన్నీ పుకార్లే, ఎవరూ ఇంతవరకు సహాయం కాదు కదా ఎలా ఉన్నావ్ అని పలకరింపు కూడా లేదు అంటూ చెప్పారు.



























