Featured

పవన్ కళ్యాణ్, శోభన్ బాబు అప్పుడే కలిసి నటించాల్సింది.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శోభన్ బాబు ల కాంబో చూడాలని అప్పటి ప్రేక్షకులు కోరుకున్నారు. ఎందుకంటే మెగా స్టార్ తమ్ముడిగా అప్పటికి కొంత ఇమేజ్ తెచ్చుకున్న పవన్, శోభన్ ల కాంబో ఎంతో బాగుంటుందని వారిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అప్పటి ప్రేక్షకులు ఉత్తరాలు కూడా రాసేవారట.. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి నటించే ఓ సినిమా మిస్ అయ్యిందట.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమా ఎంతో ప్రత్యేకమైంది.. ఇప్పటికీ ఆ సినిమా టీవీ ల్లో వస్తే టీవీలకు అతుక్కుపోతారు..

తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని బాగా చూపించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్.. తండ్రి పాత్రలో రఘువరన్ నటన ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. కొడుకుకు అండగా అన్నివేళలా ఉండే పాత్రలో రఘువరన్ ఒదిగిపోయాడు.. అప్పటివరకు విలన్ పాత్రలు చేసే రఘువరన్ ఈ చేంజ్ ఓవర్ తో ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాడు. ఈ సినిమా తోనే పవన్ కళ్యాణ్ కూడా పూర్తి నటుడయ్యాడని అంటారు. అప్పటివరకు జల్సా రాయుడుగా చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా బాధ్యత గల కొడుకుగా నటించిన మెప్పించాడు.

అయితే సుస్వాగ‌తంలో తండ్రి క్యారెక్ట‌ర్ కోసం మొద‌ట శోభ‌న్ బాబునే అడిగార‌ట‌. గ‌తంలో చిరు, శోభ‌న్‌బాబు కాంబినేష‌న్‌లో సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు ప‌వ‌న్ కు తండ్రిగా శోభ‌న్ బాబు న‌టిస్తే బాగుంటుంద‌న్న ఐడియాను వ‌ర్క‌వుట్ చేయ‌డం కోసం నిర్మాత ఆర్‌బి చౌద‌రి శోభ‌న్‌బాబు ను క‌లిసి అడిగార‌ట‌. అప్ప‌టికే సినిమాల‌నుంచి రిటైర్ అయిన శోభ‌న్‌బాబు ఇక మేక‌ప్ వేసుకోకూడద‌ని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాన‌ని చెప్పి సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. అలా సోగ్గాడు చేయాల్సిన సుస్వాగ‌తం తండ్రి క్యారెక్ట‌ర్ .. విల‌నీ రోల్స్‌తో విల‌క్ష‌ణ న‌టుడ‌నిపించుకున్న ర‌ఘువ‌ర‌న్‌కు ద‌క్కింది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago