పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శోభన్ బాబు ల కాంబో చూడాలని అప్పటి ప్రేక్షకులు కోరుకున్నారు. ఎందుకంటే మెగా స్టార్ తమ్ముడిగా అప్పటికి కొంత ఇమేజ్ తెచ్చుకున్న పవన్, శోభన్ ల కాంబో ఎంతో బాగుంటుందని వారిద్దరూ కలిసి నటిస్తే చూడాలని అప్పటి ప్రేక్షకులు ఉత్తరాలు కూడా రాసేవారట.. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి నటించే ఓ సినిమా మిస్ అయ్యిందట.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సుస్వాగతం సినిమా ఎంతో ప్రత్యేకమైంది.. ఇప్పటికీ ఆ సినిమా టీవీ ల్లో వస్తే టీవీలకు అతుక్కుపోతారు..

తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని బాగా చూపించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్.. తండ్రి పాత్రలో రఘువరన్ నటన ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. కొడుకుకు అండగా అన్నివేళలా ఉండే పాత్రలో రఘువరన్ ఒదిగిపోయాడు.. అప్పటివరకు విలన్ పాత్రలు చేసే రఘువరన్ ఈ చేంజ్ ఓవర్ తో ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యాడు. ఈ సినిమా తోనే పవన్ కళ్యాణ్ కూడా పూర్తి నటుడయ్యాడని అంటారు. అప్పటివరకు జల్సా రాయుడుగా చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా బాధ్యత గల కొడుకుగా నటించిన మెప్పించాడు.
అయితే సుస్వాగతంలో తండ్రి క్యారెక్టర్ కోసం మొదట శోభన్ బాబునే అడిగారట. గతంలో చిరు, శోభన్‌బాబు కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు పవన్ కు తండ్రిగా శోభన్ బాబు నటిస్తే బాగుంటుందన్న ఐడియాను వర్కవుట్ చేయడం కోసం నిర్మాత ఆర్‌బి చౌదరి శోభన్‌బాబు ను కలిసి అడిగారట. అప్పటికే సినిమాలనుంచి రిటైర్ అయిన శోభన్‌బాబు ఇక మేకప్ వేసుకోకూడదని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యానని చెప్పి సున్నితంగా తిరస్కరించారట. అలా సోగ్గాడు చేయాల్సిన సుస్వాగతం తండ్రి క్యారెక్టర్ .. విలనీ రోల్స్‌తో విలక్షణ నటుడనిపించుకున్న రఘువరన్‌కు దక్కింది.

































