Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ వారి దగ్గర నుంచి ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు.
ఈ క్రమంలోనే మొదటి సీజన్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో రెండవ సీజన్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి అంచనాలకు అనుగుణంగానే రెండవ సీజన్లో కూడా పలువురు సెలబ్రిటీలను రాజకీయ నాయకులను ఆహ్వానించారు. తాజాగా ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు రెబల్ స్టార్ ప్రభాస్ హాజరుకానున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రభాస్ అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ తర్వాత ఈ కార్యక్రమానికి ఎవరు వస్తారనే విషయం గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. ప్రభాస్ ఎపిసోడ్ అనంతరం ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలుస్తోంది.
గత ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి నా షో కి రావాలి అని చెప్పగా మీరు పిలవడమే ఆలస్యం తప్పకుండా వస్తామని చెప్పారు. ఎవరితో రావాలో తెలుసు కదా అంటూ బాలయ్య గత ఎపిసోడ్ లోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చారు. అయితే బాలకృష్ణ టాక్ షోలో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ ప్రసారం చేస్తారని భావిస్తున్నారు.ఇలా బాలయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకే వేదికపై కలవడంతో సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య పవన్ ఇద్దరు ఒకే వేదికపై కలవబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…