Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక..ఆ దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్న పవర్ స్టార్..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వస్తుందటే చాలు ఫ్యాన్స్ కు పండగే.. తెలుగులో ఏ హీరోకు లేని పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తుంటారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక..ఆ దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్న పవర్ స్టార్..!

తాజాగా ఆయన చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా, శివరాత్రికి వాయిదా పడింది. దీంతో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పై ఉంది. ఈసినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఈసినిమా రూపొందుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక..ఆ దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్న పవర్ స్టార్..!

తాజాగా వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు గిఫ్ట్ పంపించారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తరువాత వకీల్ సాబ్ సినిమా చేశారు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ పింక్ సినిమాకు రిమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది. ముగ్గురు అమాయకపు యువతులను కేసుల నుంచి కాపాడే లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. తెలుగు సినిమా కోసం కొన్ని మార్పులు చేసిన వేణు శ్రీరాం సూపర్ డూపర్ హిట్ కొట్టారు.

వేణు శ్రీరామ్ కు గిప్టు..

తాజాగా పవన్ క్రిస్మస్ కానుకగా వేణు శ్రీరామ్ కు గిప్టు పంపించడంతో ఆయన తెగ సంతోష పడుతున్నారు. ఆయన భార్య గాయత్రి పవన్ ఏమేం గిప్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఓమై ఫ్రెండ్ తో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరాంకు తొలి సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. తరువాత ఎంసీఏతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంతో బన్నీ ఐకాన్ మూవీ చేయాల్సి ఉంది. మళ్లీ పవన్- వేణు శ్రీరాం కాంబినేషన్లో మరేదైనా సినిమా వస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

22 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

29 minutes ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

37 minutes ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

44 minutes ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

57 minutes ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

1 hour ago