ఇప్పటి వరకూ మనం చూస్తున్న రాజకీయాలు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాలు వేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు అధికారంలో ఉన్నవారిని గుత్తాగానో.. లేదంటే సింగిల్‌గానో మూసేయాలి.. విపక్షం అనేది లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం పాలిటిక్స్‌లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. అయితే నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా అని ఏదో సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ పవన్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ట్రెండ్ అంటారా? కక్ష సాధింపులకు చెక్ పెట్టాలనేది. ఏ అధికార పార్టీ అయినా కక్ష సాధింపులకు పాల్పడటం సర్వసాధారణం. పవన్ మాత్రం వద్దు అంటున్నారు. పైగా తను తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోండని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వాస్తవానికి ఈ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. అదేదో నోటి నుంచి వచ్చిన మాటలా అనిపించలేదు. హృదయాంతరాల నుంచి వచ్చిన మాట. ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్. నిశ్శబ్దాన్ని చీల్చే మాట. సంచలనానికి నాంది పలికిన మాట. వాస్తవానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఏమాత్రం ఆశించలేము.
అవినీతి ఆస్కారం లేని పాలనను అందిద్దాం..
అధికారంలో ఉన్నవారు తప్పు చేసినా కూడా తాము తప్పు చేయలేదని గట్టిగా వాదిస్తుంటారు. అలాంటిది చేస్తే చర్య తీసుకోమన్నారు. పైగా తన పార్టీ నేతలను సైతం కక్షలు కార్పణ్యాల జోలికి వెళ్లవద్దని గట్టిగానే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా వపన్ విభిన్నమైన రాజకీయం చేస్తున్నారు. ఎవరినీ విమర్శించడం లేదు. ప్రజా సమస్యలు.. అధికారులతో సమీక్షలు తప్ప మరి వేటిని పట్టించుకోవడం లేదు. బాధ్యతగా ఉండాలని చెప్పడం కాదు.. తాను బాధ్యతగా ఉండి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి ఒక హూందాతనాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుందని.. గత ప్రభుత్వం తప్పులు చేశారని మనమూ చేయనక్కరలేదని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ రాజకీయ కక్షలు విరమించాలన్నారు. ఎవరైనా తప్పు చేస్తే.. చట్ట ప్రకారం వెళ్లాలి తప్ప వ్యక్తిగత దాడులకు దిగవద్దని సూచించారు. అవినీతి ఆస్కారం లేని పాలనను ప్రజలకు అందిద్దామని తెలిపారు.
జగన్ నానా రచ్చ చేస్తున్న తరుణంలో..
వాస్తవానికి ఇవన్నీ సినిమాల్లో మాత్రమే చూడగలం.. కానీ వాస్తవంలోనూ చూపిస్తూ పవన్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తప్పు ఎవరు చేసినా.. చివరకు తానే చేసినా శిక్షకు సిద్ధమని పవన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని పవన్ కోరారు. రాష్ట్రాన్ని పునర్మించుకునేందుకు అంతా కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు నేలపై జన్మించిన మహానుభావులను పవన్ గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ వైసీపీ అధినేత జగన్ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కక్ష సాధింపు రాజకీయాన్ని ఎన్డీఏ చేస్తోందంటూ నానా రచ్చ చేస్తున్న తరుణంలో పవన్ మాటలను జనసైనికులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. నెట్టింట పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…