AP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఈయన ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ చూడటం కోసం రావాలని పలువురు పార్టీ నేతలను కూడా విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఇక నేడు ధర్నాలో పాల్గొనడం కోసం గత రాత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇకపోతే ధర్నాలో పాల్గొన్నటువంటి ఈయన కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలియజేశారు.ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. లోకేశ్ రెడ్‌బుక్ హోర్డింగ్‌లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని తెలిపారు.
రెడ్‌బుక్ హోర్డింగ్…
ఇలా ఢిల్లీలో ధర్నా చేసినటువంటి జగన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కాకుండా కూటమి ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ప్రధానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి అలాగే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…