Movie News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్: నాని

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు ఇక పవన్ కళ్యాణ్ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ రాజకీయాలలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

రాజకీయాలపై ఉన్న ఆసక్తితో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికలలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు అయితే ఈయన రాజకీయ ప్రస్థానం కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా నాని రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు రావడంతో పవన్ గురించి నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన వారిలో నాని కూడా ఒకరు.

ఈయన పవన్ కళ్యాణ్ గెలుపును కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు మద్దతు తెలియజేశారు. ఇక తాజాగా పవన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు రాజకీయాలలో కూడా ఆయన పవర్ స్టార్ అంటూ కామెంట్లు చేశారు. ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఈయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని నాని తెలిపారు.

Pawan Kalyan: సూపర్ స్టార్..

ఇక నాని వ్యాఖ్యలపై రానా కూడా స్పందిస్తూ పవన్ నిజంగానే రాజకీయాలలో సూపర్ స్టార్ అని ఎంతో కష్టపడి రాజకీయాలలో ఈ స్థాయికి చేరుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం రాజకీయాలు కూడా సినిమాల మాదిరిగానే ఉన్నాయంటూ రానా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago