Pawan Kalyan: తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కూడా అదే స్థాయిలో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నారు. ఈయన మొదట నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చారు. అనంతరం రేణు దేశాయ్ ను రెండవ వివాహం చేసుకొని తనకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఈయన అన్నా లేజినోవాను మూడవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే తరచూ అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తరచూ ప్రస్తావనకు తీసుకురావడమే కాకుండా ఈయన నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పవన్ వ్యక్తిగత విషయాల గురించి తరచూ మాట్లాడేవారు.ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ నుంచి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నారని అయితే త్వరలోనే మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు అనే వార్తను సృష్టించారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేవలం ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ చేయడం కోసమే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టిస్తుందని పవన్ ఫ్యాన్స్ ఈ వార్తలను తిప్పికొడుతున్నారు.
గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి చర్చలు జరిపిన విషయం మనకు తెలిసిందే. ఈ చర్చల అనంతరం యువశక్తి పేరుతో జనసేన పార్టీ ఓ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సభను ఉత్తరాంధ్రలో నిర్వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయన ఇమేజ్ డామేజ్ చేయడం కోసమే ఆయన మూడవ భార్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు సృష్టించారు. నిజానికి పవన్ కళ్యాణ్ మూడో భార్యకు తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…