Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈమె గత కొంతకాలంగా తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొనడంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలపై ఒక నెటిజెన్స్ స్పందిస్తూ సమంత అందం గురించి కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా నేటిజన్స్ స్పందిస్తూ సమంతను చూస్తే చాలా జాలి వేస్తుంది. ఆమె అందం పూర్తిగా తగ్గిపోయింది విడాకుల తర్వాత ఆమె కెరియర్ చాలా మంచిగా ఉంటుందని భావిస్తే.. సమంతను మయోసైటిస్ మళ్లీ బలహీనరాలను చేసింది అంటూ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే నెటిజన్ చేసిన ఈ ట్వీట్ పై సమంత స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నాలాగా కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని అవకాశం మీకు రాకూడదని కోరుకుంటున్నాను.మీ అందం మరింత పెరిగేలా కొంచెం నా ప్రేమను కూడా మీకు పంపిస్తున్నాను అంటూ సదరు నెటిజన్ కు సమంత దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
ఇలా సమంత అందం గురించి నేటిజన్ చేసిన కామెంట్ పై పలువురు సమంత అభిమానులు మండిపడటమే కాకుండా కొందరు సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సమంతకు మద్దతు తెలుపుతూ సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…