Featured

ఆ డైరెక్టర్ కి అలాంటి కండీషన్ పెట్టిన పవన్ కళ్యాణ్… పవన్ కండిషన్ కి ఆ డైరెక్టర్ లాక్ అవుతారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చి వరస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు చిత్రంతో బిజీకానున్నారు.

ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా పవన్ చేయనున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ ను కలిసి తనకు సినిమా కథ వినిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కథ విన్న పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడికి ఒక కండిషన్ పెట్టినట్లు సమాచారం.

తన దగ్గరికి హీరోకి భారీఎలివేషన్ ఇచ్చే కథతో రావద్దని తనకు అత్తారింటికి దారేదిలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ నీ ఆకట్టుకునే, ఎఫ్ 2 వంటి హాస్యాస్పదమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో నటించాలని ఉందని, తన సినిమా కేవలం యూత్ కి మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చే విధంగా స్క్రిప్ట్ తయారు చేయమని పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

మరి అనిల్ రావిపూడి వినిపించిన కథ పవన్ కళ్యాణ్ కు నచ్చిందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.అన్నీ సెట్ అయితే పవన్ కళ్యాణ్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

10 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

13 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

14 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

14 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

16 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

16 hours ago