స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై అసలు లెక్కలు చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీ విడుదల కావడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే శనివారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సాయిధరమ్ తేజ్ హాజరుకాలేక పోయినందువల్ల ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హీరో హీరోయిన్ ల రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో ఎంత సంపాదిస్తే తనకి ఎంత మిగులుతుందన్న విషయాల గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక హీరో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో 10 శాతం ట్యాక్స్ పోగా అది కూడా కట్ చేసి హీరోకి ఇస్తారని దానిలో ఇతర ట్యాక్స్ లు మెయింటినెన్స్ కి పోనూ ఒక హీరోకు మిగిలేది ఏమీ ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు.

సాధారణంగా సినిమాలు తీసే హీరోలందరూ ఈజీగా డబ్బు సంపాదిస్తారనుకుంటారు. కానీ ఆ సినిమాలో ఆ హీరో ఎంత కష్ట పడతారో ఒక వారికి మాత్రమే తెలుసని, ప్రభాస్ రానా వంటివారు కండలు పెంచకపోతే బాహుబలి వచ్చేది కాదని, ఎన్టీఆర్ స్టెప్పులు చేయకపోతే, చరణ్ గుర్రపుస్వారీ చేయకపోతే డబ్బులు రావని ఈ సందర్భంగా హీరోల వెనక ఉన్న కష్టం తెలిపారు.

ఇక హీరోయిన్ల గురించి మాట్లాడుతూ హీరోయిన్స్ ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వస్తారని వారు అందరి మధ్యలో ఎంతో ఇబ్బంది పడుతూ నటిస్తారని వారి పడే కష్టం గురించి తెలియజేశారు. మేము కష్టపడితేనే డబ్బులు వస్తాయని సినిమావాళ్ళుకోట్లలో పారితోషకం తీసుకుంటున్నారని అర్హతలేని ప్రతి ఒక్కడు మాట్లాడుతారు. సినిమా వల్ల సంపాదించే ప్రతి రూపాయి వారి కష్టంతో సంపాదించినదే అక్రమ కట్టడాలు కాంటాక్ట్స్, టాక్స్ లు కట్టకుండా కోట్లు సంపాదించలేదని పరోక్షంగా పలువురు రాజకీయ నాయకులను ఉద్దేశించి ఈ సందర్భంగా మాటల తూటాలు వదిలారు.