Movie News

Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా రాజకీయాల పైన ఫోకస్ పెట్టారు. ఇలా రాజకీయాల పరంగా ఈయన ఎంతో బిజీగా ఉండడంతో తన సినిమా షూటింగ్లన్నీ కూడా వాయిదా పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలలో బిజీ అవుతున్నటువంటి తరుణంలో ఆయన నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇటీవల భగత్స్ బ్లేజ్ అంటూ ఒక వీడియో విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ గ్లాస్ డైలాగులు అదిరిపోయాయని చెప్పాలి. పగిలే కొద్ది గ్లాస్ కి పదును ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు అది కనిపించని సైన్యం అంటూ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ భారీ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ డైలాగు పట్ల తాజాగా పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

తనకు సినిమాలలో ఇలాంటి డైలాగులు చెప్పడం అంటే ఇష్టం ఉండదని నేను హరీష్ శంకర్ దగ్గర చెప్పాను ఎందుకు ఇలాంటి డైలాగ్స్ పెట్టారని అడగగా అందుకు హరీష్ సమాధానం చెబుతూ మీకు తెలియదు మా బాధలు మాకు ఉన్నాయి ఇలాంటి డైలాగ్స్ రాకపోతే అభిమానులు ఊరుకోరు అంటూ హరీష్ సమాధానం చెప్పారని పవన్ వెల్లడించారు.

అభిమానులు ఊరుకోరు..
ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్ మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా రాస్తాము అంటూ ఈ సందర్భంగా హరీష్ శంకర్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమ్మ తిట్టిందని అర్ధరాత్రి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయిన బాలుడు..!

ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…

12 hours ago

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…

12 hours ago

వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు… తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…

12 hours ago

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…

12 hours ago

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…

12 hours ago

మాథ్యూ పెర్రీ మృతి కేసులో సంచలన తీర్పు… ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…

12 hours ago