Political News

Pawan Kalyan: వైయస్సార్ గొప్ప వారే.. కానీ వారితో పోల్చే స్థాయి కాదు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రచారం నిమిత్తం ఈయన వారాహి వాహనాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి అలాగే కనకదుర్గమ్మ సన్నిధిన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉంటూ అధికార పార్టీని తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలుపై వైసీపీ సర్కార్‌ వివక్ష రాష్ట్ర స్థాయి సదస్సులో పవన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బ్రిడ్జి దాటగానే ఆత్మకూరు హైవే దగ్గర నుంచి వస్తూ ఉండగా జ్యోతీ బా పూలే, డాక్టర్‌ వైఎస్సార్‌ ముఖ ద్వారం అని రాసి ఉంది. ఇలా జ్యోతి బా పూలేతో కలిసి వైయస్సార్ పేరు ఉండడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.

వైయస్సార్ గొప్పవారే కానీ ఈయనని ఎంతో ప్రముఖులైనటువంటి జ్యోతి బా పూలే, అంబేద్కర్, నారాయణ గురులతో పోల్చడం సరికాదు. వారితో పోల్చే స్థాయి వైఎస్ఆర్ ది కాదు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇలా ఇద్దరు పేర్లు ఒకే చోట ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తప్పు పట్టారు.

Pawan Kalyan ఒక్కడికే పూర్తి గౌరవం ఇవ్వాలి…


ఇలా వైయస్ఆర్ పేరును జ్యోతి బా పూలే పక్కన పెట్టడంతో ఈ విషయాన్ని ఈయన తప్పు పడుతూ ఒక్కరికే మర్యాద ఇవ్వాలని అక్కడ జ్యోతి బా పూలే ఉంటే జ్యోతి బా పూలే మాత్రమే ఉండాలని, మధ్యలో ఇంకొకరి పేరు తీసుకువచ్చి వారికి గౌరవం లేకుండా చేయకూడదని తెలిపారు. ఇస్తే పూర్తిగా గౌరవం ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైయస్సార్ పేరును పెట్టడంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం పవన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పుట్టుమచ్చల రహస్యం: ఈ చోట్ల ఉంటే సంపద, సౌఖ్యం మీవే!

పుట్టుమచ్చలు అంటే సాధారణంగా శరీరంపై కనిపించే చిన్న గుర్తులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే భారతీయ సంప్రదాయాల్లో, ముఖ్యంగా…

13 minutes ago

ఎండలో బయటికి వెళ్లగానే తలనొప్పి వస్తుందా? ఇది సాధారణం కాదు… శరీరం ఇస్తున్న హెచ్చరిక!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న…

1 hour ago

పెళ్లి తర్వాత తొలి బర్త్‌డే… కూర్గ్‌లో రష్మిక సెలబ్రేషన్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత…

1 hour ago

నమ్మాలా? వదిలేయాలా? ఈ ప్రాంతాలపై ప్రజల్లో భయం ఎందుకు?

భారతదేశంలో ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు కొన్ని ప్రదేశాలు రహస్య ఆచారాలు, తాంత్రిక…

1 hour ago

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల డిజిటల్ భద్రతపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్…

1 hour ago

కామాక్షి దీపం: ఇంటి పూజలో ప్రత్యేక స్థానం… సరైన విధానం తెలిసి వెలిగిస్తేనే ఫలితం

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపం అనేది కేవలం వెలుగు మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి…

2 hours ago