Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రచారం నిమిత్తం ఈయన వారాహి వాహనాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి అలాగే కనకదుర్గమ్మ సన్నిధిన ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉంటూ అధికార పార్టీని తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై వైసీపీ సర్కార్ వివక్ష రాష్ట్ర స్థాయి సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బ్రిడ్జి దాటగానే ఆత్మకూరు హైవే దగ్గర నుంచి వస్తూ ఉండగా జ్యోతీ బా పూలే, డాక్టర్ వైఎస్సార్ ముఖ ద్వారం అని రాసి ఉంది. ఇలా జ్యోతి బా పూలేతో కలిసి వైయస్సార్ పేరు ఉండడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.
వైయస్సార్ గొప్పవారే కానీ ఈయనని ఎంతో ప్రముఖులైనటువంటి జ్యోతి బా పూలే, అంబేద్కర్, నారాయణ గురులతో పోల్చడం సరికాదు. వారితో పోల్చే స్థాయి వైఎస్ఆర్ ది కాదు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇలా ఇద్దరు పేర్లు ఒకే చోట ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తప్పు పట్టారు.

Pawan Kalyan ఒక్కడికే పూర్తి గౌరవం ఇవ్వాలి…
ఇలా వైయస్ఆర్ పేరును జ్యోతి బా పూలే పక్కన పెట్టడంతో ఈ విషయాన్ని ఈయన తప్పు పడుతూ ఒక్కరికే మర్యాద ఇవ్వాలని అక్కడ జ్యోతి బా పూలే ఉంటే జ్యోతి బా పూలే మాత్రమే ఉండాలని, మధ్యలో ఇంకొకరి పేరు తీసుకువచ్చి వారికి గౌరవం లేకుండా చేయకూడదని తెలిపారు. ఇస్తే పూర్తిగా గౌరవం ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైయస్సార్ పేరును పెట్టడంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం పవన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురు గార్లతో వైయస్ రాజశేఖర్ రెడ్డి పోల్చే స్థాయి కాదు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్లు మభ్యపెట్టి మధ్యలో YSR పేరును పెట్టడంలో వైసిపి ఆంతర్యం ఏంటి? ఏం రుద్దాలని చూస్తున్నారు – JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/PfoJprlf5n
— JanaSena Party (@JanaSenaParty) January 26, 2023