Naga Chaitanya: నాగచైతన్య థాంక్యూ చిత్రం నుంచి విడుదలైన ఫోటో… ఫోటో వైరల్!
Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో తన దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే గత ఏడాది లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ఈ ఏడాది బంగార్రాజు చిత్రంతో బాక్సాఫీస్ హిట్ కొట్టారు.
ఇలా వరుసగా విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశిఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బీటీఎస్(బి హైండ్స్ ది సీన్స్) ఫోటోని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నాగ చైతన్య సెల్ ఫోన్ చూస్తూ కూర్చోగా, రాశిఖన్నా దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారు.విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అవికా గోర్, మాళవికా నాయర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…