Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో తన దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే గత ఏడాది లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ఈ ఏడాది బంగార్రాజు చిత్రంతో బాక్సాఫీస్ హిట్ కొట్టారు.

ఇలా వరుసగా విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశిఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బీటీఎస్(బి హైండ్స్ ది సీన్స్) ఫోటోని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నాగ చైతన్య సెల్ ఫోన్ చూస్తూ కూర్చోగా, రాశిఖన్నా దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
హాకీ బ్యాక్ డ్రాప్ లో…
ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపించనున్నారు.విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అవికా గోర్, మాళవికా నాయర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Yuva Samrat @chay_akkineni & @RaashiiKhanna_ from the sets of #ThankYouTheMovie #Nagachaitanya #RaashiKhanna pic.twitter.com/aHZ8Z2A7y0
— BA Raju's Team (@baraju_SuperHit) April 25, 2022






























