Piyush Mishra: ప్రస్తుత కాలంలో అన్ని రంగాలలోనూ మహిళల అభివృద్ధి ఎంతగానో ఉంది ప్రతి ఒక్క రంగంలోనూ పురుషులకు పోటీగా మహిళలు నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి వేధింపులు కేవలం మహిళలు మాత్రమే కాదని పురుషులు కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఈ మధ్యకాలంలో కొందరు నటులు ఈ విషయం గురించి బహిరంగంగా తెలియజేశారు.
గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నటులు తాము కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నటుడు పీయూష్ మిశ్రా సైతం తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటుడుగా నటించిన ఈయన తెలుగులో సూపర్ సినిమాలో విలన్ పాత్రలో నటించారు.
ఈ క్రమంలోనే ఈయన తుమ్హారీ అక్కత్ క్యా హై పీయూష్ మిశ్రా ఆటో బయోగ్రఫీ పుస్తకంలో తాను ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఒక అమ్మాయి వల్ల లైంగిక వేధింపులకు గురయ్యానంటూ ఈ విషయాన్ని తెలియజేశారు.అయితే తను ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈయన వెల్లడించలేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రస్తుతం వాళ్లు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారని, తాను ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోలేదు అంటూ ఈయన కామెంట్లు చేశారు.
ఇక ఈ విషయం గురించి మీడియా సమావేశంలో పీయూష్ మాట్లాడుతూ… శృంగారం అనేది ఒక ఆరోగ్యకరమైన అంశం. మొదటిసారి అనుభవం ఎంతో ఆరోగ్యకరంగా ఆనందంగా ఉండాలి లేదంటే అది మీ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…