Featured

Political Analist KS Prasad : కాపులు పవన్ కళ్యాణ్ ప్రాపర్టీ కాదు…. ఆర్జీవి కి రాజకీయ అవగాహన శూన్యం..: పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్

Political Analist KS Prasad : ఏపీ రాజకీయాల మీద ఎవరికి ఎంత ఆసక్తి ఉందో కానీ రామ్ గోపాల్ వర్మ కి మాత్రం బాగా ఆసక్తి. తాను రాజకీయాల్లోకి రాడు కానీ నిత్యం రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఏపీ రాజకీయాలే కావాలి. ఇటీవలే చంద్రబాబు నాయుడు టార్గెట్ గా గుంటూరు, కందుకూరు సభలలో జరిగిన ప్రమాదాలకు చంద్రబాబు కారణం అన్నట్లు మాట్లాడి హిట్లర్, ముస్సోలిని తరువాత నువ్వే అంటూ విమర్శించాడు. ఇక నేడు పవన కళ్యాణ్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ కాపుల గౌరవంను కమ్మోళ్ల దగ్గర తాకట్టు పెట్టడు అంటూ కుల రాజకీయం చేసేసాడు. ఇక ఈ విషయాల మీద పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ తన విశ్లేషణ చెప్పారు.

వర్మకు రాజకీయ అవగాహన శూన్యం…

పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో కలవడం సభలు నిర్వహించుకోడానికి అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో గురించిన చర్చ జరిగిందంటూ ఇద్దరూ చెబుతున్నా, భవిష్యత్తు పొత్తుల గురించే ఇద్దరూ చర్చించి ఉంటారు అన్న అనుమానలను అందరికీ కలిగాయి. ఇక ఈ విషయం మీద వర్మ ఏకంగా కాపులను కమ్మోళ్ళకి అమ్మేశాడు పవన్ అంటూ కామెంట్స్ చేసాడు. దీనిపై పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ మాట్లాడుతూ వర్మ కు రాజకీయ జ్ఞానం లేదు అంటూ అభిప్రాయపడ్డారు. కాపులకు పవన్ కళ్యాణ్ లీడర్ కాదు. పవన్ కళ్యాణ్ ది కాపు పార్టీ అనో జగన్ ది రెడ్డి పార్టీ అనో పెడితే వాళ్లకు వచ్చే ఓట్లకు వాళ్ళ సామాజిక ప్రజల శాతానికి పొంతన ఎందుకు లేదు. కాపులందరికీ నాయకుడిగా పవన్ ను చిత్రించడంలోనే వర్మ అవగాహనా రాహిత్యం ఉంది. సినిమా వాళ్ళు సినిమాల్లో హీరోను చుసినట్లే బయట కూడా వాళ్ళు హీరోలు అని అనుకుంటారు.

భ్రమలో బ్రతుకుతూ ఉండే సినిమా వాళ్ళ కామెంట్స్ పట్టించుకోనవసరం లేదు అంటూ తెలిపారు. కాపుల కోసం ఒకప్పుడు లీడర్ గా నిలబడిన వంగవీటి రంగ కొడుకు గెలవడానికే ఇప్పుడు కష్టపడుతున్నాడు, ఆలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా కాపు లీడర్ అవుతాడు. ఏ కులానికి లీడర్ ఉండడు, వాడి వెనక కులం మొత్తం నడవదు అంటూ చెప్పారు కేఎస్ ప్రసాద్. అలా అయితే కమ్మ కులస్థులందరూ చంద్రబాబుకు ఓట్లేస్తే 40% ఓట్లు ఎలా వచ్చాయి. అలానే కేవలం రెడ్డి కమ్యూనిటీ ఓట్లే పడితే జగన్ కు అన్ని సీట్లు ఎలా వస్తాయి అంటూ విశ్లేషించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago