Political Analist KS Prasad : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉంది. అయితే అప్పుడే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పొత్తులు, పర్యటనలు అంటూ బిజీ అయిపోయారు. అయితే ఎవరి వ్యూహాలు వారు రచించినా అంతిమంగా ప్రజల తీర్పు కీలకం. ఎవరు ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లినా ప్రజలు మాత్రం అన్ని చూసి చివరికి నచ్చినట్టు వారికి ఓటు వేస్తారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అయితే వైసీపీ టీడీపీ జనసేన మధ్య ప్రధాన పోరు ఉండనుంది. అయితే వైసీపీ, టీడీపీ మధ్య జనసేన స్థానం, ప్రభావం ఏమిటి అన్నదే ఇప్పుడు చర్చంతా. ఇక ఈ విషయాల మీద పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ మాట్లాడారు.
పవన్ జాగ్రత్త పడితే ప్రభావం చూపుతాడు…
వచ్చే సంవత్సరం ఎన్నికలకు ఇప్పటినుండే అన్ని పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల వేళ ఇలానే పరిస్థితులు ఉంటే జగన్ కి వచ్చే నష్టమేమి లేదు అంటూ తెలిపారు ప్రసాద్. ఎన్నో కొన్ని స్థానాలు పోయినా జగన్ అధికారానికి వచ్చే నష్టం లేదంటూ తెలిపారు. ఇక టీడీపీకి కూడా తమ ఓటు బ్యాంకు వారికీ ఉందని, నిజానికి ఎవరి ఓటు బ్యాంకు వాళ్ళు ఆ పార్టీకి ఓట్లేస్తారు అయితే మిగిలిన న్యూట్రల్ గా ఉన్న 11% ఓటర్లే ఎవరు గెలుస్తారో నిర్ణయిస్తారు అంటూ తెలిపారు.
అయితే ఇక్కడ జనసేన ఇప్పటికి ఇప్పుడు అధికారంలోకి రాలేదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఒక పది స్థానాల్లో ప్రభావం చూపిస్తారు. ఒక నాలుగు ఐదు స్థానాలైనా గెలుస్తారు అంటూ ఆయన అభిప్రాయాలను తెలిపారు. అయితే రాజకీయ సమీకారణలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. చివరిలో ఎవరి మీద అభిప్రాయం ఏర్పడితే ఆ పార్టీని ఆ నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…