Pooja Hegde : 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఈసారి మన సౌత్ స్టార్స్ కు సాదరంగా స్వాగతం చెప్పింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై మన హీరోయిన్స్ గ్లామర్ ఒలకబోశారు. గతంలో మన ఇండియా నుంచి అమితాబ్, ఐశ్వర్య, ప్రియాంక, దీపిక వంటి బాలీవుడ్ స్టార్స్ కి మాత్రమే దక్కిన గౌరవం.. ఈసారి సౌత్ వాళ్లకి లభించింది. పాన్ ఇండియా లెవెల్ లో మన సినిమాలు సత్తా చాటడంతో ఈ అవకాశం లభించింది. మన టాలీవుడ్ లక్కీ హీరోయిన్.. పూజా హెగ్డే, వరుస ఫ్లాపులు మూటకట్టుకుంటున్నా బుట్బబొమ్మకు అరుదైన గౌరవం దక్కింది అనే చెప్పాలి . 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన దేశం తరపున పూజా ప్రతినిధిగా పార్టిసిపేట్ చేసింది. పూజాతో పాటూ నయనతార, తమన్నా కూడా కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం సొంతం చేసుకున్నారు. అయితే గతంలో దీపికా పదుకోన్, ఐశ్వర్యరాయ్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా వంటి బాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే ఈ రెడ్ కార్పెట్ అవకాశం లభించింది. మొదటి సారి సౌత్ హీరోయిన్స్ కి ఈ అవకాశం దక్కింది.

లగేజ్ ని పొగిట్టుకున్న బుట్టబొమ్మ……

దీపికా, ఐశ్వర్య వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెడ్ కార్పెట్ మీద నడిచినప్పటికీ, పూజా హెగ్డే తన మార్క్ స్టైల్ తో ఆధరగొట్టింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కెళ్లడం పూజాకు మొదటిసారి. ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ , తన డిజైనర్ డ్రెస్ తో పాటు, పర్సనల్ మేకప్ కిట్ కూడా తాను పోగొట్టుకుందట. రెడ్ కార్పెట్ పై నడిచిన తర్వాత అసలు ఏం జరిగిందో మొత్తం ఇంటర్వ్యూలో చెప్పింది.
తాను ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ ట్రావెల్ కి రెండు బ్యాగ్ లను ఒప్పుకోలేదట. అందుకే ఒక బ్యాగ్ ని ఇండియాలోనే వదిలేయ్యాల్సి వచ్చిందట. అంటే ఒక్క బ్యాగ్ తోనే ఫ్రాన్స్ కి వెళ్ళింది. అయితే ఇంకొక బ్యాగ్ ని కూడా జర్నీలో పోగొట్టుకుందట. ఆ బ్యాగ్ లో ఆమె డిజైనర్ డ్రెస్, తాను వాడే పర్సనల్ మేకప్ కిట్, హెయిర్ ప్రొడెక్ట్స్ అన్నీ ఉన్నాయి. రెడ్ కార్పెట్ వాక్ కోసం అందుకే లోకల్ గా డ్రెస్, మేకప్ కిట్ తోపాటు, హెయిర్ ప్రొడక్ట్స్ కూడా అక్కడే ఆమె టీం కొనుగోలు చేశారట. అదృష్టం ఏంటంటే, దానికి సంబందించిన జ్యూవెలరీ మాత్రం ఆమె హ్యాండ్ బ్యాగ్ లోనే ఉందట. రెడ్ కార్పెట్ వాక్ కి ముందు టెన్షన్ పడినా, కార్పెట్ పై మెరిసిన తర్వాత రిలాక్స్ అయ్యిందట.






























