Pooja Hegde : దక్షిణాదిన వరుసగా మూడు ప్లాప్ సినిమాలు వచ్చినా ఇంకా క్రేజ్ ఉన్న హీరోయిన్ గానే దూసుకెళుతోంది పూజహెగ్డే. అందులోనూ పెద్ద ప్రాజెక్టులతో సందడి చేస్తోంది. అంతేనా మూడు ప్లాప్ లు ఉన్నా రెమ్యూనరేషన్ విషయంలో ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అమ్మడి డిమాండ్ అలా ఉంది మరి. అయితే ఇటీవల విజయ్ సరసన తమిళం లో నటించిన చిత్రం బీస్ట్, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది.

పూజ ఖర్చుల బిల్లులను వెనక్కి పంపిన బీస్ట్ నిర్మాతలు…
ఇక ఈ సినిమాలో హీరోయిన్ అయిన పూజ సినిమా మొదలవ్వక ముందే తన స్టాఫ్ ఖర్చులను కూడా చిత్ర నిర్మాతలే భరించాలని షరతులు పెడుతుందట. క్రేజ్ ఉన్న హీరోయిన్ కావడంతో నిర్మాతలు కూడా ఈ అగ్రిమెంట్ కు ఓకే అంటున్నారు. కాగా బీస్ట్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.

అయితే సినిమా అనుకోకుండా భారీ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజకు రెమ్యూనరేషన్ ఇవ్వడమే భారంగా ఉందని ఇక తన స్టాఫ్ ఖర్చులను భరించలేమని తన స్టాఫ్ ఖర్చులకు సంబంధించిన బిల్లులను పూజకి వెనక్కి పంపారట. ముందే అగ్రిమెంట్ చేసుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో స్టాఫ్ జీతాలు వారి ఇతర ఖర్చులు లక్షల్లో ఉండటంతో భరించలేమని మీరే కట్టుకోమని పంపారట. మరి దీనిపై బుట్ట బొమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.




























