Poorna : తెలుగులో మహాలక్ష్మి సినిమాతో పరిచయమైన పూర్ణ సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, రాజు గారి గది వంటి చిత్రాలతో మంచి హిట్స్ తీసుకున్న పూర్ణ టాప్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం వెళ్ళలేదు. ఇక తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళంలో కూడా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే టీవీ షోలతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఈటీవీలో వచ్చే ఢీ షో తో మరోసారి మళ్ళీ అందరిని ఆకట్టుకుంది.
పూర్ణ భర్త కు సెలబ్రిటీలకు లింక్…..
ఇక తాజాగా పూర్ణ పెళ్లిచేసుకోబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక పూర్ణ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. పూర్ణ కాబోయే భర్త అసిఫ్ ఆలీ దుబాయ్ లోని జేబీఎస్ గ్రూప్ అధినేత, కోట్ల ఆస్తులు సంపాదించాడు. అయితే ఇతనికి చాలామంది ఇండియన్ సెలబ్రిటీస్ తో పరిచయాలున్నాయి. కానీ ఎలా అనుకుంటున్నారా, అసిఫ్ అలీ దుబాయ్ కి వచ్చే చాలా మంది సెలబ్రిటీలకు యూఏఇ గోల్డెన్ వీసాలను అందిస్తారు.
ఇక దక్షిణాది చాలా మంది సెలబ్రిటీలకు యూఏఈ గోల్డెన్ వీసాలను అందించారు. కాజల్, విజయ్ సేతుపతి, ఆండ్రియా, ప్రియమణి, నాజర్, శ్వేతమేనన్, అజారుద్దీన్ వంటి వారు ఉన్నారు. ఇక ఈయనకు ముస్లిం మత పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కేరళ సీఎం చేతుల మీదుగా బెస్ట్ వ్యాపారవేత్తగా అవార్డు తీసుకున్నారు. ఇలా పూర్ణ మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తినే పెళ్లిచేసుకోబోతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…