సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో మాట్లాడిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.జగన్ పై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదు.. సినీ పరిశ్రమ మనిషి అని పోసాని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ రెమ్యూనరేషన్ పై అతడు స్పందించాడు. పవన్ రెమ్యూనరేషన్ రూ.10 కోట్లా.. రూ.50 కోట్లా.. అని ప్రశ్నించారు. పవన్ కేవలం రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు..
కానీ తాను రూ.15 కోట్లు ఇస్తానని.. తన నాలుగు సినిమాలకు సంతకం చేస్తాడా.. అంటూ ప్రశ్నించాడు. అతడు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని నిరూపిస్తే.. తనను చెంప దెబ్బ కొట్టండంటూ.. సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని వెటకారంగా అన్నారు. జగన్ తో అసలు పవన్ కి పోలికే లేదని మండిపడ్డారు.
సీఎం జగన్ కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా..? అని ప్రశ్నించారు. ‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్ లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ తో పోల్చుకుని వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. ఇకపోతే తనకు.. చిరంజీవికి ఎలాంటి గొడవలు లేవని స్ఫష్టం చేశారు. పవన్ సినిమాలకు టిక్కెట్ రెట్లు రూ. 500, రూ.1000 అంటే ఏంటి.. మధ్య తరగతి మరియు సామాన్యులను హింసించడమే కదా అంటూ ప్రశ్నించారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…