Featured

నటుడు పోసాని కృష్ణమురళి కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!!

నటుడు పోసాని కృష్ణమురళి గురించి అందరికి తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా అయన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. కామెడీ పాత్ర అయినా, సెంటిమెంటల్ పాత్ర అయినా తనదైన స్టైల్ లో చేసి అందరిని అలరిస్తుంటారు. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో పరుచూరి బ్రదర్స్ వద్ద రచయితగా పనిచేసి ఆ తర్వాత మంచి మంచి సినిమాలకు రచయితగా పనిచేసి తనదైన మార్కుతో ఇండస్ట్రీలో టాప్ రైటర్ గా గుర్తింపు పొందాడు. గోకులంలో సీత, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య లాంటి చాలా హిట్ సినిమాలకు పని చేశారు పోసాని..

రచయితగానే కాకుండా దర్శకుడిగా కూడా అయన చాలా సినిమాలకు పనిచేశారు. అయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా కాగా ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి అవార్డులు కూడా దక్కాయి. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో చేసిన కామెడీ పాత్రలకు మంచి ప్రశంశలు దక్కాయి.

ఇకపోతే ఇండస్ట్రీ జనాలకు పోసాని వ్యక్తిగత విషయాలగురించి తెలిసిందే చాలా తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి గురించి చాల తక్కువ తెలుసు.. పోసాని గారి తో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు ఆయన పేరు ప్రజ్వల్.లాస్ ఏంజిల్స్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కోచింగ్ తీసుకుని వచ్చాక ఇంట్లోనే కూర్చుని స్టోరీ రాసుకుంటున్న ప్రజ్వల్ నీ చూసి పోసాని గారు కొరటాల శివ దగ్గర జాయిన్ అవమని చెప్పారు దాంతో ప్రజ్వల్ కొరటాల శివ దగ్గర భరత్ అనే నేను సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ప్రజ్వల్ కి హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.ప్రజ్వల్ మంత్రిగారు మాటిచ్చారు అనే ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేశారు అయితే ప్రజ్వల్ పోసాని గారిలాగా రైటర్ గా, డైరెక్టర్ గా రాణిస్తాడో లేదో చూడాలి.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago