Featured

“ప్రభాస్, అనుష్క సెట్ లో అలానే ఉంటారు..” షాకింగ్ కామెంట్స్ చేసిన కాశీ విశ్వనాథ్.

ప్రభాస్, అనుష్క ఈ జంటకి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక ఊహాగానాలు ఎప్పటినుంచో ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు ఈ జంట. మేము కేవలం స్నేహితులమే అంటూ చెప్పిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

అయితే తాజగా ప్రభాస్ – అనుష్క జంట రిలేషన్‌పై స్పందిచారు సీనియర్ నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలలో వీరిద్దరితో కలిసి నటించారు కాశీ విశ్వానాథ్. ఈ క్రమంలో అయన ప్రభాస్, స్వీటీలు సెట్‌లో ఎలా ఉంటారు అనే విషయం పై మాట్లాడుతూ.. ఇద్దరు మంచి వ్యక్తులు కలిసి ఒకేచోట మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో.. వీరిద్దరి మధ్యలో సంభాషణ కూడా అలానే ఉంటుంది. వాళ్లిద్దర్నీ చూస్తె డౌట్ పడే విధంగా, ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకునేట్టు వాళ్లు ఉండరు. అసలు సెట్ లో వాళ్ళ గురించి చెడుగా అనుకోవాలనే ఆలోచన ఎవరికీ రాదు..

జన్యూన్‌గా ఉంటారు. నాకైతే వాళ్ళ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే.. అభిమానులతో పంచుకుని వాళ్ళిద్దరూ ఒక్కటైతే చూడాలనుకునే కోట్ల మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని. పెళ్లి గురించి అనుష్కని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రతి ఒక్కరికీ వారి వారి పర్సనల్ లైఫ్ ఉంటుంది.. దానికి తగ్గట్టుగా వాళ్లకి ప్లానింగ్స్ ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి మీడియా అడిగినట్టు మేము అడగకూడదు.’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు కాశీ విశ్వనాథ్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“మూడుపూటల భోజనం కూడా ఆయన వల్లే”.. కృష్ణపై పృథ్వీరాజ్ ఎమోషనల్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన నటుడు పృథ్వీరాజ్ మరోసారి తన మాటలతో వార్తల్లో నిలిచారు.…

1 minute ago

హిట్‌మ్యాన్‌కు ఎండ్ కార్డు దగ్గరపడిందా?.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. వరుస పరాజయాలు జట్టును…

6 minutes ago

హైదరాబాద్ హిందూ మహాసమ్మేళనం హనుమాన్ చాలీసా కార్యక్రమం ముఖ్యాంశాలు..

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! - పురాణపండ శ్రీనివాస్ మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!వేల…

10 minutes ago

చిన్నప్పటి కష్టాలే అతన్ని స్టార్‌గా తీర్చిదిద్దాయి.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ స్టోరీ

తెలుగు, తమిళ సినీ ప్రపంచంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ జీవితం…

18 minutes ago

103 పరుగుల తేడా.. ముంబైకి షాక్ ఓటమి! అసలు కారణం బయటపెట్టిన కెప్టెన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్…

21 minutes ago

రోజుకు 50సార్లు ప్రేమ చెబితే.. హీరోయిన్ షాక్ రియాక్షన్!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జేడీ చక్రవర్తి మరోసారి తన వ్యాఖ్యలతో…

24 minutes ago