ప్రభాస్, అనుష్క ఈ జంటకి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక ఊహాగానాలు ఎప్పటినుంచో ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు ఈ జంట. మేము కేవలం స్నేహితులమే అంటూ చెప్పిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

అయితే తాజగా ప్రభాస్ – అనుష్క జంట రిలేషన్‌పై స్పందిచారు సీనియర్ నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్. మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలలో వీరిద్దరితో కలిసి నటించారు కాశీ విశ్వానాథ్. ఈ క్రమంలో అయన ప్రభాస్, స్వీటీలు సెట్‌లో ఎలా ఉంటారు అనే విషయం పై మాట్లాడుతూ.. ఇద్దరు మంచి వ్యక్తులు కలిసి ఒకేచోట మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో.. వీరిద్దరి మధ్యలో సంభాషణ కూడా అలానే ఉంటుంది. వాళ్లిద్దర్నీ చూస్తె డౌట్ పడే విధంగా, ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకునేట్టు వాళ్లు ఉండరు. అసలు సెట్ లో వాళ్ళ గురించి చెడుగా అనుకోవాలనే ఆలోచన ఎవరికీ రాదు..
జన్యూన్‌గా ఉంటారు. నాకైతే వాళ్ళ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే.. అభిమానులతో పంచుకుని వాళ్ళిద్దరూ ఒక్కటైతే చూడాలనుకునే కోట్ల మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని. పెళ్లి గురించి అనుష్కని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రతి ఒక్కరికీ వారి వారి పర్సనల్ లైఫ్ ఉంటుంది.. దానికి తగ్గట్టుగా వాళ్లకి ప్లానింగ్స్ ఉంటాయి. వారి వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి మీడియా అడిగినట్టు మేము అడగకూడదు.’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు కాశీ విశ్వనాథ్.































