Prabhas: బుల్లితెరపై ఎన్నో టాక్ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటిసారిగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ వచ్చింది.ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో ఆదరణ సంపాదించుకోవడంతో రెండవ సీజన్ కూడా అంతే ఘనంగా అదే అంచనాలు నడుమ ప్రారంభించారు.
ఇకపోతే రెండవ సీజన్లో ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు పూర్తి కాగా ఐదవ ఎపిసోడ్ కోసం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు, గ్లింప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందా ప్రభాస్ బాలకృష్ణ మధ్య ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయనే విషయం గురించి అందరికీ ఆత్రుత నెలకొంది.అయితే ఈ ఎపిసోడ్ ఆహాలో డిసెంబర్ 31వ తేదీ ప్రసారం చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 31వ తేదీ అప్పటికే కొత్త సంవత్సరం వేడుకలు కూడా ప్రారంభమవుతాయి కనుక అప్పుడైతే బాగుంటుందని మేకర్స్ ఆలోచించారని సమాచారం.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఒక సినిమాకు సంబంధించిన ట్రైలర్ టీజర్ విడుదల చేయాలంటే థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలకృష్ణ టాక్ షోని కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ ఎపిసోడ్ కనక థియేటర్లో విడుదల చేస్తే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అనడంలో సందేహం లేదు.మరి థియేటర్ లో ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందనే విషయం గురించి త్వరలోనే స్పష్టత రానుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…