Prabhas: ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకేక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ భారీ ఈవెంట్ లో ప్రభాస్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి భారీగా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులు వేడుకకు సెక్యూరిటీగా వచ్చారు. వారు కాకుండా ప్రభాస్ కోసం ప్రవేట్ గా దాదాపు 100 మంది సెక్యూరిటీ వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే బాంబు స్క్వాడ్ సెక్యూరిటీ కూడా హాజరయ్యారని తెలుస్తోంది.
ఈ విధంగా పోలీసులు మాత్రమే కాకుండా 100 మంది ప్రవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో నిర్మాతలకు ఖర్చు కూడా అదనంగా పెరిగిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సెక్యూరిటీ కోసం నిర్మాతలు దాదాపు పాతిక లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఇలా భారీ స్థాయిలో ఖర్చు చేయడం బహుశా ఇదే మొదటిసారి అని తెలుస్తుంది.
ఈ వేడుక కోసం సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ప్రీ రిలీజ్ వేడుక కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభాస్ సెక్యూరిటీ టైట్ చేశారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…