Prabhas:టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గాను ఫాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. పెళ్లి వయసు దాటిపోయిన ఈయన ఇంకా పెళ్లి గురించి ఆలోచించకపోవడంతో అభిమానులు తరచూ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ ఫలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ తరచూ ఈయన పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిసిపోతుంది. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కృతి సనన్ జంటగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టమని ప్రభాస్ తెలిపారు. ఇలా ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ప్రభాస్ మాట్లాడుతూ ఉన్న సమయంలోనే అన్నా పెళ్లెప్పుడు అంటూ అభిమానులు గట్టిగా కేకలు వేయడంతో తన పెళ్లి ఎప్పుడు జరిగినా కూడా తిరుపతిలోనే జరుగుతుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఈ శుభవార్తను ఎప్పుడూ చెబుతారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…