యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తర్వాత అతడి ఫేట్ మారిపోయింది. ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు. ఏ సినిమా తీసినా ఇక పాన్ ఇండియా లెవల్లో తీసేస్తున్నాడు. అతడికి ఇచ్చే రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తగ్గడం లేదనేది టాక్. ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త అసహనానికి గురవుతన్న మాట వాస్తవమే.
సినిమాకు సంబంధించి ఏమాత్రం అప్ డేట్ రాకపోవడం.. మిగతా హీరోలకు సంబంధించి లుక్స్, పోస్టర్లు, సాంగ్స్ ఇలా ఏదో ఒకటి వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ చిర్రెత్తిపోతున్నారు. దీనిపై యూవీ క్రియేషన్స్ కూడా ఆలోచించి.. ఇటీవల రాధేశ్యామ్ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేసింది. అంతే కాకుడా .. ఇంత ఇమేజ్ ను సాధించుకున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశవ్యాప్తంగా బోలెడు మంది అభిమానులను సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్..ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక అతడి అభిమానుల్లో ఒకరు. తన హెడ్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో ప్రభాస్ అని కనిపించేలా జుట్టు కత్తిరించుకున్నాడు. కాగా సదరు వీరాభిమానాని ఇటీవల ప్రభాస్ ను కలిశాడు.
అతడితో కొంత టైం స్పెండ్ చేసిన ప్రభాస్.. అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. వెరీ కాస్ల్టీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాళ్లిద్దరు కలిసి దిగిన ఫొటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ మంచి మనసు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ద్వారా నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆ వీరాభిమాని మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…