Featured

Prabhas Seenu : నా భార్య నా తప్పులని భరించింది… ప్రభాస్ లేకపోతే నేను లేను : ప్రభాస్ శీను

Prabhas Seenu : ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను, అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

నా భార్య నన్ను భరించింది…

ప్రభాస్ శీను తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండటం వల్ల తనకు పెద్దగా ఆర్థిక కష్టాలు లేవు. అయితే సినిమాల్లో నటించాలన్న కోరికతో ఇన్స్టిట్యూట్ లో చేరాలని అనుకున్నాడు. అలా ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాక ఆ తరువాత సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకోవాలని వెళ్లగా అక్కడ ప్రభాస్ పరిచయం అయి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అలా ప్రభాస్ కి కేర్ టేకెర్గా మారాడు, అలా శ్రీనివాస్ ప్రభాస్ శీను గా మారాడు. సినిమాల్లో నటించాలని ఇండస్ట్రీ కి వచ్చిన శీను ప్రభాస్ తో కలిసి ఉండేవాడు ఇంకా తన వర్క్ చూసుకునేవాడు.

అలా పరిచయాలు పెంచుకుని సినిమాల్లో అవకాశాలు వచ్చాక కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రావడానికి ప్రభాస్ తో పరిచయమే కారణం, తాను లేకపోతే నేను లేను అంటూ చెప్పారు. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ప్లాన్ చేసుకోవడం ఏమి తెలియకపోవడం వల్ల డబ్బు సంపాదించినది పోగొట్టుకున్నాను. ఆర్థికంగా చాలా బ్బంది పడినా నా భార్య నన్ను భరించింది. నేను చాలా యదవ అయినా తాను నన్ను భరించింది, తప్పులను కూడా క్షమించింది. నా జీవితంలో నా భార్య అందరికంటే ఎక్కువ, తల్లిదండ్రులు ఎపుడు మనల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు కానీ భార్య అలా ఉండాల్సిన పని లేదు కానీ నా భార్య నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పటికీ ఒకేలాగా ఉంది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago