Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి పృథ్వీగా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసిన పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమి పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ.
హీరోయిన్స్ ఒళ్ళో కూర్చోపెట్టుకునేవారు…
పెళ్లి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 60 నుండి 70 వరకు సినిమాలను చేసారు. పృథ్వీ గారి నాన్న పోలీస్ ఆఫీసర్ అవడం వల్ల సినిమాల షూటింగలకు వెళ్తూ చూస్తూ వచ్చేవారట. ఇక ఒకరోజు బంధువులను సినిమా షూటింగ్ చూపించడానికి తీసుకెళ్తే అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ మిస్ అవడంతో పృథ్వీ ని చూసి సినిమాలో తీసుకున్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ అయిన పృథ్వీ గారు చాలా సినిమాల్లో చేసారు.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం వల్ల స్కూల్ కి వెళ్లడం, హోమ్ వర్క్ వీటన్నింటిలో కొంచెం వెసులుబాటు ఉండేదని చెప్పారు. అలాగే హీరోయిన్లు చాక్లెట్స్ తినిపిస్తూ ఒళ్ళో కూర్చుబెట్టుకుని బుజ్జగించేవాళ్ళు అది బాగుండేది. వాణిశ్రీ, హేమ మాలిని, సావిత్రి ఇలా అగ్ర హీరోయిన్లందరూ చాక్లెట్స్ తినిపించేవాళ్ళు అంటూ అప్పటి విషయాలను చెప్పారు పృథ్వీ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…