Prem Rakshit: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పాటలలో నాటు నాటు పాట ఒకటి. ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎంతోమంది త్రిబుల్ ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ పాట ఇంత మంచి సక్సెస్ సాధించడానికి ఎందరో కృషి ఉందని చెప్పాలి. ఈ పాటకు సంగీతం అందించిన కీరవాణి పాట రాసిన చంద్రబోస్, డాన్స్ చేసిన హీరోలతో పాటు ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ పాత్ర కూడా అంతే ఉంది.
ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట కోసం ప్రేమ్ రక్షిత్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ఇక ఈయన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందడంతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నేడు ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఒకప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోవాలని అనుకున్నారట. అసలు ఈ ప్రేమ్ రక్షిత్ ఎవరు ఈయన సూసైడ్ కథ ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రేమ్ రక్షిత్ తండ్రి వజ్రాల వ్యాపారం చేసేవారు. 1993లో కుటుంబ విభేదాల కారణంగా ఆయన ఆస్తులు పోవడంతో ఆయన జీవనాధారం కోసం డ్యాన్స్ అసిస్టెంట్‌గా మారారు. ఆ సమయంలో ప్రేమ్ రక్షిత్ ఓ టైలర్ షాప్‌లో పనిచేసేవారు. డ్యాన్స్ పై మక్కువతో ఆయన కూడాnడాన్స్ మాస్టర్ గా ప్రయత్నాలు చేసిన అవకాశాలు రాలేదు. దీంతో విసిగిపోయిన ప్రేమ్ రక్షిత్ సైకిల్ పై చెన్నైలోని మెరీనా బీచ్ కి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట.
అక్కడికి వెళ్లిన తర్వాత ఈయన ఒక నిమిషం ఆలోచిస్తూ తాను చనిపోతే డాన్స్ ఫెడరేషన్ వాళ్లు తన కుటుంబానికి 50వేల ఆర్థిక సహాయం అందిస్తారని భావించారట చనిపోయే ముందు తాను పక్కింటి వారి సైకిల్ వేసుకొని వచ్చానని అది కనుక తీసుకువెళ్లి ఇవ్వకపోతే తన ఫ్యామిలీని వేధిస్తారని భావించిఆ సైకిల్ ఇంటి దగ్గర పెట్టి వచ్చి సూసైడ్ చేసుకోవాలనుకున్నారట అయితే ఇంటికి వెళ్ళగానే తన తండ్రి ప్రేమ్ రక్షిత్ కు సినిమాలలో కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చిందని చెప్పడంతో ఈయన ఎగిరి గంతేయడమే కాకుండా తన సూసైడ్ ఆలోచనని కూడా విరమించుకున్నారు. ప్రేమ్ రక్షిత్ ఏకంగా ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదగడం నిజంగా గర్వించదగ్గ విషయం.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…