బిగ్ బాస్ కార్యక్రమం 13 వారాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే 13వ వారంలో భాగంగా ప్రియాంక సింగ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. పింకీ ఎలిమినేషన్ అంటూ నాగార్జున చెప్పగానే ఎంతో భావోద్వేగమైన ప్రియాంక వేదికపైకి వచ్చి హౌస్ సభ్యుల గురించి మాట్లాడారు.
ఇలా కంటెస్టెంట్ ల గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ భావోద్వేగంగా బిగ్ బాస్ హౌస్ ను వీడారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత పింకీ బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అరియానాతో కలిసి ఎన్నో ముచ్చటించారు. ఇక అరియానా మీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని అడగగా.. అందుకు పింకీ మానస్ అంటూ సమాధానం చెప్పింది.
ఇక అరీయానా మాట్లాడుతూ మీ గురించి కాజల్, మానస్ మాట్లాడుకున్న వీడియో ఒకటి ఉంది చూద్దాం అంటూ వీడియో క్లిప్ ప్లే చేశారు. ఇందులో మానస్ పింకీ లేకపోవడంతో బాధగా ఉన్నట్లు కనిపించగా మానస్ పింకీ వెళ్లడంతో.. తన వైఫ్ హౌస్ నుంచి వెళ్లినట్టు ఫీల్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఇది చూసిన ప్రియాంక మానస్ ఐయామ్ సో సారీ నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటూ భావోద్వేగం అయింది
ఇక చివరిగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో మానస్ కి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అంటూ అరియానాను అడగడంతో మానస్ గురించి నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే తను ఎవరినైనా ఈజీగా ఒక పుస్తకాన్ని చదివి పక్కన పడేసినట్లు పడేస్తాడు అని తెలిపింది. నేను తనని ఎలా ట్రీట్ చేశానని చెబుతూ నాకు కనుక పిల్లలు ఉంటే ఎలా చూసుకునేదాన్నో తనని అలా చూసుకున్నా అంటూ ప్రియాంక ఈ కార్యక్రమంలో ఎమోషనల్ అయింది. మరి మానస్ ప్రియాంక గురించి ఎలాంటి భావనలో ఉన్నారు అనే విషయం క్లారిటీగా తెలియాలంటే బిగ్ బాస్ బజ్ కార్యక్రమం ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…