Priyanka Jain: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నటువంటి ప్రియాంక జైన్ గురించి పరిచయం అవసరం లేదు మౌనరాగం సీరియల్ ద్వారా ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ 5కంటెస్టెంట్ గా ఉండబోతున్నారు. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలోనే తన ప్రియుడు శివకుమార్ తన ముంబై హోం టూర్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ముంబైలో స్లమ్ ప్రాంతంలో ప్రియాంక ఇల్లు ఉండేదని అయితే వీరిది చాలా చిన్న గది అని ఈ గదిలోని దాదాపు 9 మంది కుటుంబ సభ్యులు ఉండే వాళ్ళని ఈమె ఈ వీడియో ద్వారా తెలియజేశారు. అప్పట్లో 9 మంది ఇక్కడే ఉండే వాళ్ళమని మా ఇంట్లో అందరికీ కలిపి ఒకటే వాష్ రూమ్ కూడా ఉండేది అంటూ ప్రియాంక వారి చిన్నప్పటి పరిస్థితిలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే ఈమె తండ్రి బిజినెస్ లోకి అడుగుపెట్టి ఒకరిని నమ్మి పూర్తిగా నష్టాలు పాలయ్యారని తెలుస్తుంది.
ఇలా తన ముంబై హోం టూర్ వీడియోని ఈ సందర్భంగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒకసారిగా అందరూ ప్రియాంక ఇంత పేదరికం అనుభవించారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తన తల్లిదండ్రులు బెంగళూరులో అద్దె ఇంటిలో ఉంటున్నారని ఆ ఇంటికి 15 వేల రూపాయల అద్దె చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే ఆ డబ్బును కూడా ప్రియాంక సీరియల్స్ చేసి ప్రతి నెల ఇంటికి ఖర్చులకోసం పంపించేదని తెలిపారు.
ఇప్పటికి అద్దె ఇంట్లోనే…
ఇక ప్రస్తుతం ప్రియాంక వాళ్ళమ్మ డబ్బు కోసం పెళ్లిళ్లలో పెళ్లికూతురులకు మెహందీ పెట్టడం వారికి మేకప్ వేయడం వంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు అని ప్రియాంక పేదరికం గురించి ఆమె ప్రియుడు శివకుమార్ ఈ హోమ్ డోర్ వీడియోస్ సందర్భంగా తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈమె సీరియల్స్ చేస్తూ ఉండటంవల్ల తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కాస్త మెరుగుపడిందని శివకుమార్ తెలిపారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…