Karan Johar: సౌత్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్.. మాకు టైం వస్తుందంటూ కామెంట్?

Karan Johar: ఒకప్పుడు దేశంలో నార్త్ హీరోల హవా ఎక్కువ సాగింది. బాలీవుడ్ సినిమాలంటే చాలా గొప్పగా చూసేవారు. మన సౌత్ హీరో, హీరోయిన్లు కూడా నార్త్ సినిమాలలో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు. చాలామంది హీరోయిన్లు సౌత్ నుండి నార్త్ కి వెళ్లి సెటిల్ అయ్యారు. కానీ సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు అని ఇప్పుడు నిరూపణ అయ్యింది. కొన్ని సందర్భాలలో ఓడలు బళ్ళు కావచ్చు , బళ్ళు ఓడలు కావచ్చు.

ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీ పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఒకప్పుడు దేశంలో నార్త్ సినిమాల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయి నార్త్ లో సౌత్ సినిమాల డామినేషన్ బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఇండస్ట్రీలో మేమే నంబర్ వన్. మాకు మేమే పోటీ అంటూ వారి గురించి గొప్పలు చెప్పుకున్నారు. చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. హిట్లు లేక బాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది.


ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2, పుష్ప వంటి సినిమాలు నార్త్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్నాయి. హిట్స్ లేకపోవటంతో బాలీవుడ్ పరిస్థితి అయిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ స్టార్ డైరక్టర్,ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ సౌత్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఒక ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్..బాలీవుడ్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని, అల వ్యాఖ్యలు చేసేవారిది చెత్త వాగుడు అంటూ కొట్టి పారేశాడు.

Karan Johar: కంటెంట్ ఉంటే ఏ భాషలో అయిన హిట్ అవుతాయి…

బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన కతియావాడి, భూల్‌ భూలయ్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే సినిమాలు ఎక్కడైనా బాగా ఆడుతాయని ఆయన వెల్లడించారు. సౌత్ సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ అవటంతో వాటిముందు నార్త్ సినిమాలు ప్రేక్షకులకు కనిపించడం లేదని ఆయన తెలియజేశారు.బాలీవుడ్ కి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. మా వద్ద ఉన్న సినిమాలు బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకువస్తాయని ఆయన వెల్లడించారు.