Producer Natti Kumar : ఏపీ రాజకియంలో తాజాగా విశాఖ ఎంపీ గురించి జనసేన అధినేత చేసిన అవినీతి ఆరోపణల గురించి ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఘాటుగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వాఖ్యలు చేసారు. అవినీతి మీద ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి అసలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ ఇష్యూ గురించి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ ఎంపీ మీద ఫైర్ అయ్యారు. నీ గత బాగోతం అంత తెలుసు అంటూ కామెంట్స్ చేసారు.

2018 లో ల్యాండ్ కబ్జా… కిడ్నాప్…
ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయా నాయకుడిగా అలాగే సినిమా నిర్మాత గా కొన్నిసినిమాలను నిర్మించారు. ఇక ఆయన మీద నట్టి కుమార్ విరుచుకుపడ్డారు. ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు కానీ 2018 లో ల్యాండ్ కబ్జా విషయంలో కేసు ఎదుర్కొన్నది ఎవరో సత్యనారాయణ చెప్పాలి. అలాగే కిడ్నాప్ చేయించడం వంటి విషయాలు కూడా మాకు తెలుసు.

పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. క్రిస్టియన్ భూములను ఆక్రమించాలని ప్రయత్నించాడు. వైజాగ్ లో ఏ భూమిని వదల్లేదు. ఇక్కడ అవినీతి అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడి నుండి తెలంగాణ వెళ్లాలని అనుకుంటున్నాడు. ఆ వెళ్ళేది ఏదో రాజీనామా చేసి వెళ్ళమని పవన్ కుడా చెప్పేది అంటూ నట్టి కుమార్ ఎంవివి సత్యనారాయణ గురించి ఫైర్ అయ్యారు.
































