మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని మసాజ్ సెంటర్ల పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరు వాళ్లు దాడి చేయడంతో అక్కడ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం కొనసాగుతున్నట్లు గుర్తించారు. ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
దాడి చేసిన సమయంలో కొందరు యువతులతో పాటు యువకులు ఉన్నట్లు గుర్తించారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు. ఈ దాడిలో పట్టుబడిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు బంజారా హిల్స్ రోడ్ నం 12 లోనే ఎక్కువగా ఇలాంటి మసాజ్ సెంటర్ల నడుస్తున్నాయి. మసాజ్ ముసుగులో ఇలాంటి వ్యభిచారం నిర్వహిస్తూ గతంతో కూడా చాలా సెంటర్లలో దాడి నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వాహకులను , యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఎవరు నిర్వహించినా.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…