మసాజ్ ముసుగులో వ్యభిచారం.. దాడిలో పట్టుబడిన యువతులు..!

0
804

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని మసాజ్ సెంటర్ల పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరు వాళ్లు దాడి చేయడంతో అక్కడ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం కొనసాగుతున్నట్లు గుర్తించారు. ‘ఎలిగంట్‌ బ్యూటీ స్పాలూన్‌, అథర్వ హమామ్‌ స్పా’ పేర్లతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు.

దాడి చేసిన సమయంలో కొందరు యువతులతో పాటు యువకులు ఉన్నట్లు గుర్తించారు. మసాజ్ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసులకు నిందితులను అప్పగించారు. ఈ దాడిలో పట్టుబడిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు బంజారా హిల్స్ రోడ్ నం 12 లోనే ఎక్కువగా ఇలాంటి మసాజ్ సెంటర్ల నడుస్తున్నాయి. మసాజ్ ముసుగులో ఇలాంటి వ్యభిచారం నిర్వహిస్తూ గతంతో కూడా చాలా సెంటర్లలో దాడి నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వాహకులను , యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఎవరు నిర్వహించినా.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.