Rashmika: వామ్మో రష్మికలో ఈ టాలెంట్ చూశారా… ఏకంగా అన్ని భాషలలో మాట్లాడగలరా?

0
31

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం వరుస భాషలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక వివిధ భాష చిత్రాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా రష్మిక తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అందుకే తనకు సోషల్ మీడియాలో ఏకంగా 38 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇలా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు ఏమాత్రం విరామం దొరికిన సరదాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీరు ఎన్ని భాషలలో మాట్లాడగలరు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతాను ఆరు భాషలలో మాట్లాడగలను అంటూ సమాధానం తెలియజేశారు అదే విధంగా తాను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలను నమస్తే బాగున్నారా అంటూ పలకరిస్తానని ఈమె తెలియజేశారు.

Rashmika: ఆరు భాషలలో మాట్లాడగలను…


ఇలా ఈమె ఆరు భాషలలో మాట్లాడగలను అంటూ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే తనకు తన వృత్తి అంటే చాలా దానిని తాను ఎంతో ప్రేమిస్తున్నానని రష్మిక తెలిపారు. ఇకపోతే తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ తనకు కొరియన్ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా తనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కూడా ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.