Prudhvi Raj Daughter: సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయ్యారు కమెడియన్ పృథ్వీరాజ్. ఇలా ఈ డైలాగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఈయన గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలిపిన విషయం మనకు తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈయనకు వైసిపి ప్రభుత్వం ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పదవిని అప్ప చెప్పింది.
అయితే కొన్ని కారణాలవల్ల ఈ పదవి నుంచి తొలగించడంతో పృధ్విరాజ్ సైతం ప్లేట్ ఫిటాయించారు.
ప్రస్తుతం ఈయన వైసీపీ పార్టీకి కాకుండా జనసేన పార్టీకి జై అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక కమెడియన్ గా ఈయనకు అవకాశాలు తగ్గడంతో డైరెక్టర్ గా మారిపోయారు ఈ క్రమంలోనే క్రాంతి అనే హీరోతో తన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రాన్ని చేస్తున్నారు.
ఈ సినిమాలో పృధ్విరాజ్ కుమార్తె హీరోయిన్ గా నటించడం విశేషం అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన తండ్రి గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమాలో అవకాశం తనకు తన తండ్రి ఒక కూతురుగా ఇవ్వలేదని ఈ పాత్రకు తాను కరెక్ట్ గా సరిపోతానన్న ఉద్దేశంతో నాన్న తనకు ఈ పాత్ర ఇచ్చారని తెలియజేశారు.
ఇక నాన్న సినిమాలలో ఎంతో అద్భుతమైన కామెడీ చేస్తూ మంచి మంచి పాత్రలలో నటించారు. నేను తన పాత్రలను ఎంతో ఇష్టపడతాను కానీ తన రాజకీయాలు నాకు నచ్చవని తెలిపారు.పాలిటిక్స్ లోకి వెళ్లొద్దని నాన్నకు నేను చెప్పలేను ఎందుకంటే నాన్నకు పాలిటిక్స్ అంటే ఎంతో ఇష్టమని ఈమె తెలియజేశారు అయితే ఇండస్ట్రీలోకి వచ్చేముందు నాన్న నాకు ఒకే విషయం చెప్పారు. మీ ముందు వెనుక చాలా జరుగుతుంటాయి కానీ వాటిని పట్టించుకోకు అని సలహా ఇచ్చారని శ్రీలు తెలిపారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…