Featured

Pruthvi : కథ రాసి సముద్రఖని చేతిలో పెడితే సీరియల్లా సినిమా తీసాడు… మూడు రోజుల్లో ఎత్తేశారు : పృథ్వీ

Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీగా పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా, ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమీ పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. ఇక వ్యాపారాల్లో, సినిమా ప్రొడక్షన్ లో వేలు పెట్టి చాలా డబ్బు నష్టపోయానని ఆయన అనుభవాలను ఇటీవల ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

సముద్రఖని సినిమా తీయమంటే సీరియల్ లాగా తీసాడు…

పెళ్లి సినిమాతో తెలుగులో కూడా మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న పృథ్వీ ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి వరకు బబ్లు పృథ్వీ గా ఉన్న పృథ్వీ పెళ్లి పృథ్వీ గా పేరు మారిపోయింది. ఇక వరుస సినిమాలతో ఉన్న పృథ్వీ మలేషియా వంటి దేశాల్లో ఆస్తులను కొనాలనుకొని నష్టపోయారు. అక్కడే కాఫీ షాప్ లాంటిది పెట్టాలని నాలుగు కాఫీ షాపులను తెరచి నష్టాలను చూసాడు. ఇక సినిమా నిర్మాణంలో కూడా నష్టాలను చూసారు.

అప్పటికే సీరియల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సముద్రఖని కి ఒక కథ ఇచ్చి సినిమా తిద్దామని నిర్మాతగా పృథ్వీ ఉండి సినిమా చేస్తే ఆ సినిమా ప్రివ్యూ చూసిన రోజే పృథ్వీ గారికి అర్థమైందట, సినిమా సీరియల్ లాగా వచ్చింది అని. హీరోయిన్ ఇంట్రడక్షన్ వంటివి లేకుండా సాధారణంగా తీయడం వల్ల సినిమా బాగా రాలేదు ప్రివ్యూ చుసినపుడే సినిమా వర్క్ అవుట్ కాదని చెప్పేసాడట పృథ్వీ. ఇక విడుదల అయ్యాక మూడు రోజులు కూడా ఆడకుండానే థియేటర్లలో ఏత్తేశారట అలా సినిమా నిర్మాణంలో కూడా చేతులు కాల్చుకున్నారట.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago