కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం భారతీయ సినీ పరిశ్రమను తీవ్ర విషాదం లో నింపేసింది. చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్లిపోయినా పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు,అలాగే సినీ పరిశ్రమలో పలువురు ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు.పునీత్ కు తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎంతో మంచి క్రేజ్ వుంది. తెలుగు స్టార్ హీరోలందరితోనూ అతడికి మంచి సంబంధం ఉంది.
పునీత్ తండ్రి కన్నడ లెజెండ్రీ యాక్టర్ రాజ్ కుమార్ కావడంతో ఆ తరం నుంచి ఇక్కడ సినిమా కుటుంబాలు నందమూరి, అక్కినేని, కొణిదెల, ఘట్టమనేని ఫ్యామిలీ లకు చెందిన హీరోలతో కంటిన్యూ చేస్తూ వచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాని పవర్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు పునీత్. ఇక పునీత్ తొలిసారిగా నటించిన సినిమా అప్పు. తెలుగులో పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ సినిమాకి రీమేక్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
అయితే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే తెలుగులో ఎన్టీఆర్ నటించిన సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ ఇదే సినిమాను కన్నడలో పునీత్ రీమేక్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆ సినిమా మరేదో కాదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆంధ్రావాలా సినిమా. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయినప్పటికీ కన్నడ మాత్రం సూపర్ హిట్ అయ్యింది.
ఇది ఇలా ఉంటే నిన్న పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఆయన తుది శ్వాస విడిచారు. పునీత్ మరణంతో కేవలం శాండల్ వుడ్ మాత్రమే కాకుండా భారత సినీ పరిశ్రమ సైతం ఈ విషయం విషాదంలో నింపేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…