Featured

వైరల్ అవుతున్న పునీత్ రాజ్ కుమార్ చివరి ట్వీట్..!

కన్నడనాట పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అతి చిన్న వయసులోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పునీత్ రాజ్ కుమార్ నేడు ఉదయం జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించి అతనికి వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.అతి చిన్నవయసులోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న పునీత్ మరణం ఇండస్ట్రీకి తీరని విషాదంగా మారింది. ఈ క్రమంలోని ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం ముందుగా హైఅలర్ట్ విధించింది.ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన చివరి పోస్ట్ ఏంటి అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం పునీత్ హోంబలే బ్యానర్‌లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా ఇన్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పునీత్ భజిరంగి-2 టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ చివరి ట్వీట్ చేశారు. ఇందులో కథానాయకుడిగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈయన మరణాంతరం అతని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసినట్లు ప్రకటించారు. స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న పునీత్ మృతదేహాన్ని ప్రేక్షకుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తరలించారు ఈయన మృతదేహాన్ని సందర్శించిన కేజిఎఫ్ హీరో యష్ తన పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago